ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

By dhanadhannews.com

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.అనంతరం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య  మాట్లాడుతూ ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ ప్రజలు అరిగోసలు పడుతున్న దృశ్యాన్ని చూసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆహార్నిషలు శ్రమించి నీళ్లు నిధులు నియామకాలు కెసిఆర్ చచ్చుడా తెలంగాణ వచ్చుట నినాదంతో తెలంగాణ స్వరాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రత్యేక తెలంగాణ సాధించిన నాయకుడు కెసిఆర్ అని తెలిపారు.అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, మండల ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ, సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి,  సీనియర్ నాయకులు అబ్బీడి రవీందర్ రెడ్డి, ముత్యాల వీరారెడ్డి, తిరుపతి గౌడ్, రవీందర్ గౌడ్, శంకర్ నాయక్, రమేష్ నాయక్, పి వెంకటయ్య, టి రజినీకాంత్, వి మోహన్ రావు, పి నారాయణ, చాడ ఆదిరెడ్డి, చాడ ప్రకాష్ రెడ్డి, మహిపాల్ సింగ్, వేణు, ఏసిక ఐలయ్య  , వెంగల రవి, రమేష్ నాయక్, రాజిరెడ్డి, టి నరేష్ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు వివిధ గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు.