సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్24:సైదాపూర్ ప్రభుత్వ జూనియర్ కళశాల సైదాపూర్ ఏప్రిల్24 బుధవారం రోజున ఉదయం11:00 గంటలకు ప్రకటించిన ఫలితాలలో ఇంటర్ ఫలితాలలో, ద్వితీయ సంత్సర ఫలితాలలో 43 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 28 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అనగా 65.11శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బైపిసి నుండి సల్మా 849 మార్కులతో తో ద్వితీయ సంవత్సరంలో కళాశాల టాపర్ గా నిలిచారు.అలాగే ప్రథమ సంవత్సరంలో 47 మంది విద్యార్థులకు గాను 19 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు అనగా 40శాతం మంది విద్యార్తులు ఉత్తీర్ణత సాధించారు ప్రథమ సంవత్సరంలో సి.ఈ.సి నుండి గుంటి వైష్ణవి 432/500మార్కులు సాధించి ప్రథమ సంవత్సరంలో టాపరు గా నిలిచింది. పై విధంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ సత్య నారాఆంజనేయ అభినందించారు.
