అక్క చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు

By dhanadhannews.com

  • తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా హుజురాబాద్ పట్టణానికి  చెందిన తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ ని ఆయన  నివాసంలో సోదరి అశ్విని, తదితర సోదరీమణులు రాఖీలు కట్టారు. ముందుగా హారతి ఇచ్చి తిలకం దిద్ది రాఖీ కట్టిన అనంతరం నోరు తీపి చేసి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎల్ వి అర్జున్ మాట్లాడుతూ, రక్షాబంధన్ పండుగ కులమతాలకు అతీతంగా సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీక. ఈ పండుగ మనసుల్లో ప్రేమ, విశ్వాసం, ఐక్యతను పెంపొందిస్తుంది. ప్రతి సోదరుడు సోదరీమణుల రక్షణ బాధ్యతను హృదయపూర్వకంగా స్వీకరించి,సమాజంలో సౌభ్రాతృత్వాన్ని కాపాడాలి అని పేర్కొన్నారు. ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.