మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శించే స్థాయి కౌశిక్ రెడ్డికి లేదు

By dhanadhannews.com

  • కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ ఒడితల ప్రణవ్
హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్.

హుజురాబాద్,ధనాధన్ న్యూస్:

బీసీ సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శించే స్థాయి కౌశిరెడ్డి లేదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలకంగా పనిచేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ను తెలంగాణ ఉద్యమ ద్రోహి అయిన పాడి కౌశిక్ రెడ్డి విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. మానుకోట ఉద్యమకారులపై రాలురువ్విన చరిత్ర కౌశిక్ రెడ్డి గాని ఆ విషయాన్ని గుర్తుంచుకొని ప్రవర్తించాలని ఆయన హితవు పలికారు. భార్యాబిడ్డలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ గెలిచిన చరిత్ర నీది కాదా అని ఆయన ప్రశ్నించారు.పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పొన్నం ప్రభాకర్ కృషి చాలా గొప్పదని అన్నారు.