కవ్వంపల్లి రవి కి దళితరత్న అవార్డు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 02: మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వైభవంగా జరిగింది.ఉత్సవాల కమిటీ చైర్మన్ అట్లూరి లక్ష్మణ్,సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈ వేడుకలు నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, lమాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్,ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం తదితరులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ మేస్త్రి రోజా రాణి, బైరి వెంకటేష్ చేతుల మీదుగా హుజురాబాద్ నియోజకవర్గంలోని నగరం గ్రామానికి చెందిన కవ్వంపల్లి రవికి “దళితరత్న” అవార్డు ప్రదానం చేసి సన్మానించారు. రవి మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సేవలందిస్తున్నారు.


ఈ అవార్డు ప్రదానంపై కవ్వంపల్లి రవి స్పందిస్తూ, తనకు ఈ గౌరవం లభించడానికి సహకరించిన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్, డాక్టర్ రామకృష్ణ, ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ మేస్త్రి రోజా రాణి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment