- ముక్కెర రాజు,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ జన సమితి.
తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం శాసనమండలి ఎన్నికను అడ్డుకుంటున్న కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెబుతారని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు అన్నారు. కోదండరాంపై కేసీఆర్ కుట్రలు కొత్తేమి కాదని గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక రకాల దాడులకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో కోదండరాం పోటీ చేస్తే వందలాది కోట్లు ఖర్చుపెట్టి ఆరోజు ఓడించారని పేర్కొన్నారు.కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టడమే కాకుండా అనేక రకాల కేసులను పెట్టి గత తొమ్మిది సంవత్సరాలుగా పలు రకాల దాడులకు పాల్పడ్డ కేసీఆర్ చట్టసభలకు ఎన్నిక కాకుండా అడ్డుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఉద్యమ కారులపై కేసీఆర్ చేస్తున్న కుట్రలను, నిర్బంధాలను తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామికవాదులు,ఉద్యమకారులు వ్యతిరేకించాలని ఆయన కోరారు.తెలంగాణ ప్రజల నుంచి శాశ్వతంగా కెసిఆర్ ను దూరం చేసే రోజులు దగ్గర పడ్డాయని ముక్కెర రాజు పేర్కొన్నారు.
