- తెలంగాణ జన సమితి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.లక్ష్మి
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని,రాష్ట్రం లో వెంటనే మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జన సమితి మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు రాగులపెల్లి లక్ష్మి డిమాండ్ చేశారు.మహిళా జన సమితి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన మహిళా సదస్సులో వారు మాట్లాడుతూ దేశంలో,రాష్ట్రంలో ఇంకా మహిళలు రెండవరకం పౌరులుగానే చూడబడుతున్నారని,సమాన పనికి సమాన వేతనం ఇంకా పొందలేకపోతున్నారని తెలిపారు.
ఎన్నికల సమయాల్లో మహిళను మహారాణులను చేస్తామంటూ ఉదార కొట్టుడే తప్ప మహిళలకు న్యాయం చేయడం లేదని తెలిపారు.కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో నన్న మహిళల పరిస్థితి మెరుగుపడుతుందని ఆశపడ్డ మహిళా లోకానికి ఆశాభంగం కలిగిందని వారు తెలిపారు.నూతనంగా ఏర్పటైనా ప్రభుత్వంలో నైనా మహిళల ఉపాధికోసం ప్రత్యేకంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని,విద్యా, ఉద్యోగ అవకాశాలలో మహిళల రిజర్వేషన్ కి ప్రత్యేక బడ్జెట్ కెటాయించాలని,మహిళల మీద హింస జరుగకుండా ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తో మాట్లాడి మహిళల సమస్యల పరిస్కారం దిశగా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఓయూ ప్రొఫెసర్ లక్ష్మి,ప్రొఫెసర్ అంజలీదేవి,డాక్టర్ సాజిదా ఖాన్,మహిళా జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అరికిల్ల స్రవంతి,గీతాంజలి,శాంతబాయి,రేఖ,సక్కుబాయి,పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
