- సైదాపూర్ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి
సైదాపూర్,ధనాధన్ న్యూస్:
సైదాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ
భారత మాజీ ప్రధాని తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.దక్షిణ భారతదేశం నుంచి తెలుగు రాష్ట్రం నుండి ఏకైక ప్రధానిగా కొనసాగి దేశాన్ని ఆర్థిక లోటు నుంచి ఎదుగుతున్న దేశంగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. సంస్కరణల పితామహునిగా పేరుపొంది భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ఘనత పివి నరసింహారావుదే అని కొనియాడారు. ఆయన చేసిన ఆర్థిక సంస్కరణ వల్లనే ఈరోజు దేశంలో సాంకేతిక విప్లవం కొనసాగుతుందని అన్నారు.ఆయనను గుర్తించి భారతరత్న ప్రకటించడం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.ఈ సమావేశంలో వెన్నంపల్లి సింగల్ విండో అధ్యక్షులు బిల్ల వెంకట్రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య,మాజీ సర్పంచులు చందా శ్రీనివాస్,కాయిత రాములు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేశ్వర రెడ్డి,రేగుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
