యూత్ కాంగ్రెస్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా రాఘన్‌

By dhanadhannews.com

సైదాపూర్/ధనాధన్ న్యూస్:
యూత్ కాంగ్రెస్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా రాఘన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాఘన్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఏఎంసీ డైరెక్టర్ చోటే మియా మాట్లాడుతూ – రాఘన్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విశేష కృషి చేశారని అన్నారు. రాఘన్ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఎండీ చోటే మియా, పల్లె గోపాల్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ సైదాపూర్ మండల అధ్యక్షుడు వేముల సాయికుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు అంబాలా ప్రేమకుమార్, సీనియర్ నాయకులు చల్లూరి రవి, గాజర్ల రమేష్, వీరగోని సదానందం గౌడ్, పడాల తిరుపతి గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శి బానోతు తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.