గుర్తు తెలియని మహిళ మృతి..వివరాలు తెలియజేయాలంటూ రైల్వే పోలీసుల విజ్ఞప్తి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 29:
జమ్మికుంట – బిసుగిరిషరీఫ్ రైల్వే స్టేషన్ల మధ్య జమ్మికుంట రైల్వే ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు.


ప్రాథమిక సమాచారం ప్రకారం, మహిళ ఎగువ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని, లేక ఇతర కారణాలతో మృతి చెందిన అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు మెరూన్ రంగు చుడిదార్ ధరించి ఉండగా, దానిపై నలుపు-తెలుపు డిజైన్ ఉన్నట్లు తెలిపారు. ప్రమాద తీవ్రత కారణంగా తల పూర్తిగా దెబ్బతినడంతో ముఖాన్ని గుర్తుపట్టడం సాధ్యం కాలేదని వెల్లడించారు.


మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేదా ఇతర వస్తువులు లభించలేదని, ప్రస్తుతం మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు.


ఈ కేసును ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి, రామగుండం విచారణ చేస్తున్నారు. మృతురాలి గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే 9949304574, 8712658604 నంబర్లకు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Leave a comment