గురుకుల విద్యార్థుల తల్లితండ్రులకు ఊరట

By dhanadhannews.com

  • దూర ప్రాంతాల గురుకులాల్లో చదివే
    విద్యార్థులకు బదిలీ కోసం అవకాశం
  • కృతజ్ఞతలు తెలిపిన టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభు
టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభు.

తల్లి తండ్రులకు దూరంగా ఉన్న గురుకుల విద్యాలయం నుండి దగ్గరగా ఉన్న గురుకుల విద్యాలయం తమ పిల్లలను మార్చుకునే అవకాశం కల్పించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్ణయాన్ని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్(టి.జి.పి.ఏ) కృతజ్ఞతలు తెలిపింది.ఈ సంద్భంగా టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 250 ఎస్సీ గురుకులాలలో చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులు ఎవరైతే వారి ఇంటికి దూరంగా ఉన్నామని బాధ పడుతున్నారో,తమ పిల్లల వద్దకు వెళ్లాలంటే అనేక బస్ ఛార్జీలు,శ్రమకు ఓర్చి రెండవ శనివారం వెళ్ళలేక వెళుతున్న తల్లితండ్రులకు ఇది మంచి పరిణామం అని ఒక ప్రకటనలో తెలిపారు.ఈ అవకాశాన్ని రాష్ట్ర తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో చదివిస్తున్న విద్యార్థినీ విద్యార్థుల తల్లి తండ్రులు వినియోగించుకోవాలనీ కోరారు.ఈ అవకాశం పిబ్రవరి 2 నుండీ 12 వరకు అవకాశంఉందని,2023- 24 విద్యా సంవత్సరంలో 5,6,7,8,9 తరగతులలో బదిలీ కోసం దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందన్నారు.ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవడానికి సంబంధిత దరఖాస్తు ఫామ్ లు మీ పిల్లలు ప్రస్తుతం చదువుతున్న ప్రిన్సిపాల్ వద్ద దొరుకుతాయని,ఆ పాఠశాల లో నుండి కావలసిన చోటుకి దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.