- ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ గా డాక్టర్ కృష్ణారావు
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి గత కొద్ది నెలలుగా విధుల పట్ల నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్న సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కృష్ణ కుమార్ పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ వేటు వేశారు.మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది నెలలుగా కృష్ణ కుమార్ వీధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. అనంతరం వైద్య సిబ్బందితో ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. వారి స్థానంలో వెన్నెంపల్లి పల్లె దవాఖాన డాక్టర్ కృష్ణారావును ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ గా బాధ్యతలు అప్పగించాలని హుజరాబాద్ డిప్యూటీ డిహెచ్ఎంఓ చంద్రు నాయక్ కు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిహెచ్ఎంఓ చంద్రు నాయక్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యామ్ నాయక్,హెల్త్ ఎడ్యుకేటర్ ప్రతాప్,జిల్లా ఆరోగ్యం బోధకులు పంజల ప్రతాప్,ఫార్మసీ సురేష్ కళ్యాణ్,పల్లె దవఖాన డాక్టర్ వైద్య సిబ్బంది ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
