
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏ. బూసి శ్రీనివాస్‌కు ప్రతిష్టాత్మకమైన తెలుగు వెలుగు జాతీయ ఉగాది పురస్కార్ – నంది అవార్డు ప్రదానం చేశారు. సామాజిక సేవ, పత్రికా రంగాల్లో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు.
తెలుగు వెలుగు సాహితీ వేదిక (జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు వెలుగు జాతీయ ఉగాది సాహితీ–సాంస్కృతిక ఉత్సవాలు 2026 సందర్భంగా ఈ అవార్డు ప్రదానోత్సవం ఆదివారం కరీంనగర్ పట్టణంలోని ఫిల్మ్ భవన్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉగాది పురస్కారాల చైర్మన్ యాదగిరి గౌడ్ అధ్యక్షతన, ముఖ్య అతిథులుగా శాంతి కృష్ణ ఆచార్య, ప్రముఖ హాస్య నటుడు ఆర్.ఎస్. నందం పాల్గొని శ్రీనివాస్‌కు అవార్డు అందజేశారు.సభలో సామాజికవేత్త గూట్ల రాజ మల్లయ్య, ప్రపంచ ప్రఖ్యాత ఆచార్య, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత శాంతి కృష్ణ, సినీనటి గుంటుక రాధిక, కిరణ్ కుమార్, అద్దంకి నాగరాజు, వంగల శాంతి కృష్ణ, ఆచార్య పోలోజు రాజ్ కుమార్, పొడిచెట్టి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు శ్రీనివాస్ సేవలను ప్రశంసిస్తూ, ఆయనకు అభినందనలు తెలిపారు.