మానవత్వాన్ని చాటిన
ట్రాన్స్ జెండర్ గాజుల హరిత

By dhanadhannews.com

ఆర్థిక సహాయం అందిస్తున్న ట్రాన్స్ జెండర్ హరిత.

వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన దుకిరే రాజు ఇటీవల వ్యవసాయ కూలి పనుల నిమిత్తం పనికి వెళ్లగా ఫిట్స్ వచ్చి పొలంలోని మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న మండలంలోని ఘన్ముక్ల గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ గాజుల హరిత మృతుని కుటుంబాన్ని మంగళ వారం తమ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి,కుటుంబ స్థితిగతులను తెలుసుకొని ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ట్రాంజెండర్ హరిత మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన రాజు కూలి పని చేస్తూన్న వ్యక్తి దురదృష్టవశాత్తు మరణించడం బాధ కలిగించిందని అన్నారు.ఇలాంటి నిరుపేదల కుటుంబాలకు అండగా నిలవాల్సిన రాజకీయ నాయకులు ప్రజలు అండగా నిలువకపోవడం బాధాకరమైన విషయమని అన్నారు.ఈ కుటుంబాన్ని ఆర్థికంగా,డబుల్ బెడ్ రూమ్,పిల్లలను నాణ్యమైన విద్యకై గురుకులాల్లో చేర్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో కూడా మృతుని కుటుంబ సభ్యులకు తన సహాయ సహకారాలు అందజేస్తారని సామాజిక బాధ్యత అనేక సేవా కార్యక్రమాలు చేశానని గాజుల హరిత తెలిపారు.ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్నట్లు కనిపించనీ దేవుళ్లను పూజించడం కంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకొని పుణ్యం చేసుకోవాలని హరిత కోరారు.