మహముత్తారం/ధనాధన్ న్యూస్, జూలై 19: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పోలంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆదివారం రామ్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్బీఐ సంజీవని క్లినిక్ ఆన్ వీల్స్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ శిబిరంలో సుమారు 200 మంది గ్రామస్తులు పాల్గొని ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు అవసరమైన వారికి హిమోగ్లోబిన్ (HB), గ్రూప్ రాండమ్ బ్లడ్ షుగర్ (GRBS), వైడల్ (Widal), యూరిన్ ప్రెగ్నన్సీ టెస్ట్ (UPT), మలేరియా (MP) తదితర ప్రయోగశాల పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు.


శిబిరం విజయవంతంగా నిర్వహించడంలో రామ్కీ ఫౌండేషన్ బృందం, ఎస్బీఐ సంజీవని క్లినిక్ ఆన్ వీల్స్ సిబ్బంది, పోలంపల్లి గ్రామ ఆశా కార్యకర్తలు విశేష సహకారం అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బొట్కు నర్సింలు, వైద్య బృంద సభ్యులు పాల్గొని శిబిర నిర్వహణను పర్యవేక్షించారు. గ్రామీణ ప్రజలకు వారి నివాస ప్రాంతానికే నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు అందించడం, ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
