ప్రజా భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం

వికారాబాద్/ధనాధన్ న్యూస్,జూన్ 06: వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లి 10వ వార్డులో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.వార్డు సభల ద్వారా స్థానిక సమస్యలను గుర్తించడం, అభివృద్ధి పనులను సూచించడం, సమగ్ర వార్డు అభివృద్ధి ప్రణాళిక రూపొందించడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం […]

తెలంగాణ భూములను దోచుకునే కుట్ర జరుగుతోంది: కల్వకుంట్ల కవిత

హైదరాబాద్/ధనాధన్ న్యూస్,జూన్ 06: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో భారీ స్థాయిలో భూదందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శనివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను బడాబాబులకు అప్పగించే కుట్ర చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఇందుకు సంబంధించిన ఆధారాలను దశలవారీగా ప్రజల ముందుకు తీసుకువస్తానని తెలిపారు. తెలంగాణ భూములు, […]

సర్వేకు రేటు కట్టిన సర్వేయర్‌కు ఏసీబీ షాక్‌

సైదాపూర్‌/ధనాధన్ న్యూస్ జూన్‌ 5:మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. భూమి సర్వే నిర్వహించేందుకు రైతు నుంచి లంచం డిమాండ్‌ చేసిన మండల సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సర్వేయర్‌తో పాటు ఇద్దరు సహాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌ గ్రామానికి చెందిన రైతు చుంచు మహేందర్‌కు సైదాపూర్‌ మండలం అమ్మనగుర్తి గ్రామ శివారులో మూడు ఎకరాల భూమి […]

ఎండదెబ్బతో గొర్రెల కాపరి మృతి

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 5: మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఎండదెబ్బ తగిలి మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిల్లి శ్రీశైలం (29) గురువారం ఉదయం గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో తీవ్ర ఎండ ప్రభావంతో తల తిరగడం, వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తన తండ్రి పిల్లి తిరుపతికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో తిరుపతి గ్రామానికి చెందిన […]

మరమ్మతులకు నోచుకోని తుమ్మలచెరువు కట్టు కాలువ

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 4: సైదాపూర్ మండలంలోని తుమ్మలచెరువు కట్టు కాలువ గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు రెండు చోట్ల దెబ్బతిన్నప్పటికీ ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదని వెంకేపల్లి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు మునుపాల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రానున్న వర్షాకాలానికి ముందే చెరువు కట్టు కాలువకు మరమ్మతులు చేపట్టకపోతే భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. మరోసారి భారీ వర్షాలు కురిస్తే తుమ్మలచెరువు కట్ట పూర్తిగా […]

ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్:తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైదాపూర్ మండలంలోని గ్రామాల్లో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడుతూ..దశాబ్దాల కల నెరవేరిన రోజు తెలంగాణ ఆవిర్భావ దినమని పేర్కొన్నారు. ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. “మన రాష్ట్రం – మన పాలన” అనే లక్ష్యంతో […]

16నెలలుగా ఫైల్ పెండింగ్..!డిపివోపై ఫిర్యాదు

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 2:జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి (డిపివో) చీకోటి మదన్ మోహన్ గత 16 నెలలుగా నివేదిక సమర్పించకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ కోరుట్లకు చెందిన చుక్క గంగారాజం సోమవారం జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ 2025 సెప్టెంబర్ నెలలో జారీ చేసిన ఆదేశాలను సైతం జిల్లా పంచాయతీ అధికారి బేఖాతర్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన చుక్క గంగారాజం, కోరుట్ల […]

పెండింగ్ బిల్లుల చెల్లింపునకు వెళ్లిన మాజీ సర్పంచుల అరెస్ట్

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 1: పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సైదాపూర్ మండల మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రేగుల సుమలత అశోక్ మాట్లాడుతూ, తమ పదవీకాలంలో గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. పనులు పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు […]

హుజురాబాద్‌లో ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ నాయకులకు అవగాహన కార్యక్రమం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్,మే 29:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్‌ఐఆర్ (SIR) అంశంపై గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పించాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎస్‌ఐఆర్ సమన్వయకర్త, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమం హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో […]

గుర్తు తెలియని మహిళ మృతి..వివరాలు తెలియజేయాలంటూ రైల్వే పోలీసుల విజ్ఞప్తి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 29:జమ్మికుంట – బిసుగిరిషరీఫ్ రైల్వే స్టేషన్ల మధ్య జమ్మికుంట రైల్వే ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మహిళ ఎగువ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని, లేక ఇతర కారణాలతో మృతి చెందిన అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం […]