crimenews
సగర సంఘ సేవలు అభినందనీయం
వీణవంక/ధనాధన్ న్యూస్: సగర సంఘం సేవలు అభినందనీయమని హన్మకొండ పట్టణానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ గుండేటి గణేష్ అన్నారు.సగర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు కోరిక మేరకు మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలోని సగర సంఘ కార్యాలయంలో సగర సంఘం నేతృత్వంలో హన్మకొండలోని గణేస్ ఐ కేర్ అండ్ ఆఫ్టికల్స్,సాయితేజ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ … Read more
ఆకునూరు గ్రామపంచాయతీలో డి.ఎల్.పి.ఓ విచారణ
సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో నూతన గ్రామపంచాయతీ నిర్మాణంలో, స్మశాన వాటికల పనుల్లో అప్పటి పలు అవకతవకలు జరిగాయని అదే గ్రామానికి చెందిన రావుల రాజిరెడ్డి అనే వ్యక్తి డిసెంబర్ 24న కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై హుజురాబాద్ ఇన్చార్జి డి.ఎల్.పి.ఓ శ్రీనివాస్ ఫిర్యాదు దారుడితోపాటు,మాజీసర్పంచ్ రమణ రెడ్డిని పిలిపించుకొని విచారణ చేపట్టారు.విచారణ చేసిన నివేదికను పై అధికారులకు అందజేస్తానని డి ఎల్ పి ఓ పేర్కొన్నారు.ఈ … Read more
ఆ గ్రామంలో మద్యం అమ్మేవారి చెప్తే 10 వేల నజరానా
కామారెడ్డి/ధనాధన్ న్యూస్: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామస్థులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోతాయిపల్లి గ్రామస్థులు తమ గ్రామంలో మద్యనిషేధం విధిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో బెల్టుషాపులు ఎక్కువవటం వల్ల యువకులు, రైతుకూలీలు మద్యానికి బానిసలై ఆర్థికంగా నష్టపోతున్నారని.. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్న విషయాలను పరిగణలోకి తీసుకుని.. మద్యనిషేధం విదిస్తున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ మద్యనిషేధ తీర్మానం.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని తెలిపారు.అయితే.. ఫిబ్రవరి ఒకటో తారీఖు … Read more
జాతీయజెండాను అవమాన పరిచిన పంచాయతీ కార్యదర్శి
సైదాపూర్ మండలంలోని సోమవారం గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించే క్రమంలో జెండా ఊడి నేలపై పడింది.గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం ద్వారానే జాతీయ జెండా ఆవిష్కరించే క్రమంలో నేలపై పడ్డది అని జాతీయ జెండా అవమాన పరిచిన పంచాయతీ కార్యదర్శి ఊసకోయిల రాజీవ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ ని కోరారు.పంచాయతీ కార్యదర్శి రాజీవ్ మండలంలోని సీనియర్ నాయకుడి కి కుటుంబ సభ్యుడు కావడం వల్ల,ఏం జరిగినా ఆయన చూసుకుంటాడనే ధోరణి తో తన … Read more
గ్రామ సభ విజయవంతానికి సహకరించాలి
సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో నూతనంగా ఏర్పడిన గర్రెపల్లి గ్రామ పంచాయతీ ఆవరణంలో గురువారం చేపట్టనున్న మొట్టమొదటి గ్రామ సభను ప్రజలు విజయవంతం చేయాలని అదే గ్రామానికి చెందిన దోకిడి తిరుపతి తెలిపారు.ప్రజల ఇన్ని నాళ్ల కల ఈరోజు తొలి గ్రామపంచాయతీ ఏర్పడడం ద్వారా తీరిందని తెలిపారు.ఇన్నాళ్లు సోమారం గ్రామానికి అనుబంధంగా గర్రెపల్లి గ్రామం ఉందని ఇప్పుడు కొత్తగా గ్రామపంచాయతీ ఏర్పాటుతో ఆనందం వ్యక్తం చేశారు.గ్రామంలోని ప్రజలు అర్హులైన ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణం … Read more
ఎమ్మెల్యే పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: సహాచర జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు హేయమైన చర్య అని హుజురాబాద్ కాంగ్రెస్ శ్రేణులు అన్నారు.ఈ మేరకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు.కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు,ఎమ్మెల్యేల పట్ల కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు,వాడిన పదజాలం సరిగా లేదని ప్రజా సమస్యల పట్ల … Read more
ప్రభుత్వ పాఠశాలలోని విద్యుత్ మోటార్ ధ్వంసం
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలంలోని కోరపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో పీఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విద్యుత్ మోటార్ ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.పాఠశాలలోని విద్యార్థుల సౌకర్యార్థం మంచినీటి కోసమై పిఎంకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోరుతోపాటు మోటార్ మంజూరు చేయించి స్కూల్ యాజమాన్యానికి అప్పగించడం జరిగింది.దీనిలో భాగంగా ఆదివారం గుర్తు తెలియని దుండగులు హైస్కూల్లో ఉన్న మోటార్ ను ధ్వంసం చేయడంతో పాటు సంబంధిత పైపును కట్ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సమ్మయ్య … Read more
మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి అమానుషం
కొమ్మెర తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షులు కుడితాడు బాపూరావు, జిల్లా కార్యదర్శి కరీంనగర్/ధనాధన్ న్యూస్: మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉన్న మీడియాకు జవాబుదారిగా ఉండాల్సిన వ్యక్తులు అసహనంతో బౌతికదాడులకు పాల్పడడం సరైంది కాదని ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొమ్మెర తిరుపతిరెడ్డి, కుడితాడు బాపురావు లు పేర్కొన్నారు.సమాజానికి వాస్తవాలు చెప్పడం కోసం పాత్రికేయులు వృత్తి నిబద్దతతో … Read more
సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,బండి మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలని జమ్మికుంట ఎస్సై ఆరోగ్యం తెలిపారు.జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామములో సాయంత్రం సైబర్ క్రైమ్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.నేను సైతం కార్యక్రమంలో సోలార్ సీసీ కెమెరాల పట్ల ప్రజల మరింత బాధ్యతగా ముందుకు వెళ్లాలని,దాతలు సహకరించాలని,మంచి కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పోలీసు అధికారులు జలీల్,సోని,బ్లూ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.