ఆకునూరులో అన్నదానం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలో వాయుపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అన్నదాత గుర్రాల సంజీవ్ ఉమా దంపతులు మాట్లాడుతూ గ్రామ ప్రజల సుఖసంతోషాల కోసం, అష్ట ఐశ్వర్యాలు, సిరిసంపదలు లభించాలని గణనాధుని ప్రార్థించామని తెలిపారు.అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాయుపుత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు, ఆకునూరు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జమ్మికుంటలో గణేష్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారుల సూచనలు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్ ఆగస్టు 26:రేపటి నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఈ రోజు జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్. రామకృష్ణ, మండల తహసీల్దార్ (ఎం.ఆర్.వో), మున్సిపాలిటీ సిబ్బంది,ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు సమావేశమై ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద విద్యుత్ వైరింగ్‌ను తప్పనిసరిగా లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ ద్వారానే చేయాలని స్పష్టం చేశారు. వైరింగ్‌లో … Read more