డంపింగ్ యార్డు స్థల మార్పిడికి కట్టుబడి ఉన్నాం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన డంపింగ్ యార్డు స్థలాన్ని మార్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. గురువారం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ, ఆయనను వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని ప్రణవ్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో రీల్స్, లైకులు పొందడానికే పరిమితమై, ప్రజా సమస్యల […]

హుజూరాబాద్‌లో మున్సిపల్ కార్మికుల నిరసన – లేబర్ కోడ్ల రద్దు కోరుతూ ఆందోళన

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్‌లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని అటెండెన్స్ పాయింట్ వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే 2021 సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. […]

పాడి కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని మాదిగ హక్కుల దండోరా డిమాండ్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్:  తెలంగాణ అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న తాజా పరిణామాలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రసంగిస్తున్న సమయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్యే పదవి నుండి బర్తరఫ్ చేయాలని మాదిగ హక్కుల దండోరా(ఎమ్ హెచ్ డి ) డిమాండ్ చేస్తోంది.నిండు సభలో ఒక దళిత ఎమ్మెల్యేతో బి ఆర్ […]

సీనియర్ జర్నలిస్టు ఏబూసి శ్రీనివాస్‌కు నంది అవార్డు ప్రదానం

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏ. బూసి శ్రీనివాస్‌కు ప్రతిష్టాత్మకమైన తెలుగు వెలుగు జాతీయ ఉగాది పురస్కార్ – నంది అవార్డు ప్రదానం చేశారు. సామాజిక సేవ, పత్రికా రంగాల్లో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు.తెలుగు వెలుగు సాహితీ వేదిక (జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు వెలుగు జాతీయ ఉగాది సాహితీ–సాంస్కృతిక ఉత్సవాలు […]

ఆధ్యాత్మిక సేవలకు గౌరవం..డా.నాగుల సత్యం గౌడ్‌కు జాతీయ పురస్కారం

ప్రజాకవి, తత్వవేత్త, ఆధ్యాత్మిక విశ్వ గురువు బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్‌కు జాతీయ స్థాయి “ఆధ్యాత్మిక విజ్ఞాన జ్యోతి” పురస్కారం అందజేశారు.ఈ కార్యక్రమం కరీంనగర్‌లోని ఫిలిం భవన్‌లో ఘనంగా నిర్వహించారు.సామాజిక సేవ, ఆధ్యాత్మిక సేవ, రచనా రంగాల్లో ఆయన చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేశారు.మానవ విలువల పరిరక్షణలో ఆయన చేస్తున్న సేవలు విశేషంగా నిలిచాయి.తెలుగు వెలుగు సాహితీ వేదిక, తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, శ్రీ విరాట్ విశ్వకర్మ […]

దళితుల పట్ల కౌశిక్ రెడ్డికి వివక్ష తగ్గదు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: దళితుల పట్ల కౌశిక్ రెడ్డి వివక్ష చూపెట్టడం తగదని,నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ ప్రస్థానంలో ఉన్న సీనియర్ నాయకుడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల శాసన సభ వేదికగా కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు అసభ్యకరమని,దీనిపై వెంటనే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆయన కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. కౌశిక్ రెడ్డి దళితులపై […]

అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా ముందస్తు అరెస్ట్ – వడ్డెర సంఘం నేత ఆగ్రహం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా, వడ్డెర సంఘం జమ్మికుంట మండల అధ్యక్షుడు పల్లపు రవిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పల్లపు రవి మాట్లాడుతూ, వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు అయ్యేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు.అలాగే, వడ్డెర కులాన్ని ఎస్టీ (ST) జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. […]

ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి

జమ్మికుంట/ధనధన్ న్యూస్: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అక్రమ అరెస్టులకు పాల్పడటం తీవ్రంగా ఖండనీయమని బీఆర్ఎస్వీ టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా “ఆరు గ్యారంటీలు” ప్రకటించిందని గుర్తుచేశారు. అందులో ఉద్యమకారులకు గుర్తింపు కార్డు,250 గజాల ఇల్లు స్థలం, ₹25,000 పెన్షన్ ఇవ్వాలని హామీ ఇచ్చినప్పటికీ, రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. ఈ హామీల […]

భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణానికి ‘కోటి గోటి తలంబ్రాలు’ సమర్పణ

జమ్మికుంట/ఇల్లందకుంట, మార్చి 22:కరీంనగర్ జిల్లాలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో ఈ నెల 27న (మార్చి 27, 2026) జరగనున్న శ్రీరామనవమి కల్యాణ మహోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ వేడుక కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన శ్రీరామదాసు భక్త మండలి (చెల్పూర్) వారు అత్యంత భక్తిశ్రద్ధలతో సిద్ధం చేసిన ‘కోటి గోటి తలంబ్రాలను’ ఆదివారం ఆలయ అధికారులకు సమర్పించారు. నియమ నిష్ఠలతో తలంబ్రాల తయారీగత పది సంవత్సరాలుగా భద్రాచలం మరియు […]

మత సామరస్యానికి ప్రత్యేకగా రంజాన్ వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహన్ ఆధ్వర్యంలో ముస్లిం పాత్రికేయులకు అధికారులకు టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమానికి జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ ములుగు ప్రశాంత్, పట్టణ సీఐ ఎస్ రామకృష్ణ గౌడ్, హాజరై వారు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని అన్నారు. రంజాన్ మాసంలో సూర్యాస్తమయం తర్వాత ముస్లింలు తమ రోజా (ఉపవాసం) విరమించే భోజనాన్ని “ఇఫ్తార్” […]