హనుమకొండ, ధనాధన్ న్యూస్: పరకాల నియోజకవర్గం నడికూడ మండలం చర్లపల్లి గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్ బీఆర్ఎస్ పార్టీని వీడి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.ఈ సందర్భంగా పలువురికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పాలన,అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ,ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధి కోసం సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.చర్లపల్లి సర్పంచ్ తో సహా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనో త్సాహం,కొత్త ఒరవడిక వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.వీరితోపాటు బిఆర్ఎస్ నుండి బండి శివకృష్ణా,శరత్,రామస్వామి, నితిన్,సుమన్,గణేష్,రమాకాంత్ దాదాపు 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Leave a Reply