- తహసీల్దార్‌కు 5వ వార్డు కౌన్సిలర్ యాట్ల సునీత వినతి

జమ్మికుంట,జూలై 3(ధనాధన్ న్యూస్): జమ్మికుంట నూతన తహసీల్దార్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గడ్డం సుధాకర్‌ను 5వ వార్డు కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా 5వ వార్డులోని గౌన్లవానీకుంట ఆక్రమణలకు గురవుతోందని, వెంటనే రెవెన్యూ సర్వే నిర్వహించి కుంట హద్దులు నిర్ధారించి, చుట్టూ రక్షణ గోడ (బౌండరీ) ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని వార్డు ప్రజల తరఫున తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
వినతిపై స్పందించిన తహసీల్దార్ గడ్డం సుధాకర్, త్వరలోనే సంబంధిత అధికారులను పంపించి సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికి కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ తహసీల్దార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూత్ అసెంబ్లీ కార్యదర్శి రోమాల రాజ్‌కుమార్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు దాసరి రామ్మూర్తి, శివమణి అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
