పెద్ద వాగులో ప్రమాదకరంగా పెరిగిన వరద ప్రవాహం

మహా ముత్తారం, జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం నిమ్మగూడెం–పెగడపల్లి గ్రామాల మధ్య ఉన్న పెద్ద వాగులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా నిమ్మగూడెం గ్రామపంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు.వాగు దాటే మార్గంలో గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను అడ్డంగా నిలిపి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. నీటి ప్రవాహం తగ్గే వరకు ఎవరూ వాగును దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు […]
భారీ వర్షానికి ఇళ్లు కూలి నిరాశ్రయమైన నిరుపేద కుటుంబం

కాటారం, జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల మల్లయ్య ఇంటి గోడలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గోడలు కూలిపోవడంతో ఇంటిలో నివసించడం ప్రమాదకరంగా మారి, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ఈ ఘటనపై స్పందించిన ఎర్రగుంటపల్లి గ్రామ యువత, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అత్యవసర ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని […]
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు శాస్త్రవేత్త సూచనలు

కాటారం, జూలై 27(ధనాధన్ న్యూస్): ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, సమన్వయకర్త డాక్టర్ కె. మదన్ మోహన్ రెడ్డి సూచించారు.కాటారం రైతు వేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్న మూడు రోజుల […]
సకాలంలో వర్షాలు కురవాలని గ్రామదేవతలకు జలాభిషేకం

సైదాపూర్,జూలై 17 (ధనాధన్ డిజిటల్ న్యూస్): సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో శుక్రవారం సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఊరేగింపు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సంప్రదాయం ప్రకారం రోకలి బండకు కప్పను వస్త్రంతో కట్టి గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి గడపకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. “కప్పతల్లి… కప్పతల్లి… కడవడే నీళ్లు” […]
వర్షాలు కురవాలంటూ గ్రామదేవతలకు జలాభిషేకాలు

హుస్నాబాద్/ధనాధన్ న్యూస్: ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతూ, వర్షాలు కురవాల్సిన సమయంలోనూ వర్షాల జాడ కనిపించకపోవడంతో హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామస్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.గ్రామంలో ఉన్న గ్రామదేవతలు, వనదేవతలు, హనుమంతుడు, భైరవాది గుట్టలోని కాలభైరవ స్వామికి జలాభిషేకాలు చేసి వర్షాలు కురవాలని వేడుకున్నారు. సంప్రదాయ ఆచారాల ప్రకారం బండపై వరద పాశం పోసి నాలుకతో అద్దడం, బతకమ్మ ఆటలు ఆడడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుపక్షాదులు, ప్రజలు చల్లగా […]
కరీంనగర్‌లో పిడుగుపాటు..యువకుడికి తృటిలో తప్పిన ప్రమాదం.

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లాలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్‌లో ఒక స్థానికుడు తన మొబైల్‌తో వర్షాన్ని రికార్డ్ చేస్తుండగా, సమీపంలో అకస్మాత్తుగా పిడుగు పడింది.ఈ సంఘటనతో అతడు తీవ్ర భయాందోళనకు గురై ఉలిక్కిపడ్డాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
