ఘనంగా తెలంగాణ జన సమితి 8వ ఆవిర్భావ వేడుకలు

  • కరీంనగర్ జిల్లా కేంద్రంలో వృద్ధులకు పండ్లు,మజ్జిగ పంపిణీ

కరీంనగర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 29:
తెలంగాణ జన సమితి (TJS) పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాయి.సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు వృద్ధాశ్రమ నివాసితులతో నేరుగా మాట్లాడి, వారి ఆరోగ్యం మరియు ఇతర అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు ఎల్లవేళలా అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాం నాయకత్వంలో టీజేఎస్ పార్టీ ఆవిర్భావం నుండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.


సామాన్య ప్రజల గొంతుకగా మారి, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.
మహిళలు,యువత మరియు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పార్టీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని వివరించారు.ప్రజా సమస్యలపై పోరాటంతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మేలు చేయడమే మా లక్ష్యమని,భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి,పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కర్రె సతీష్ యాదవ్,యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అరికిల్ల భానుచందర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.వీరితో పాటు పార్టీ నాయకులు సంజీవ్, కుమార్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a comment