- టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో లో ప్రెస్ క్లబ్ ప్రారంభం
- జర్నలిస్ట్ లకు అండగా ఉంటాం-జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు
జమ్మికుంట పట్టణంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జమ్మికుంట ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని నిస్వార్ధంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా అనునిత్యం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి చేరవేసే క్రమంలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయమని,అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అనేక జర్నలిస్టుల కథనాల వల్ల ఉద్యమానికి ఎంతో మేలు జరిగిందని ఆయన కొనియాడారు.
- ప్రభుత్వం జర్నలిస్టులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి
- మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న-కోటీ
ఇలాంటి జీతభత్యాలు లేకుండా నిస్వార్ధంగా సేవలందిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం తక్షణమే స్పందించి నివేషణ స్థలాలు అందించాలని,వర్కింగ్ జర్నలిస్టులందరికీ తక్షణమే హెల్త్ కార్డులు జారీ చేయాలని దేశిని స్వప్న కోటి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు కుడతాడి బాబురావు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భూపతి సంతోష్,జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ అరికిల్ల భానుచందర్,హుజరాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షుడు సౌడమల్ల యోహన్,ప్రధాన కార్యదర్శి అయిత రాధాకృష్ణ,ఉపాధ్యక్షుడు ఏబూషి సంపత్, కోశాధికారి దయ్యాల సుధాకర్,సహాయ కార్యదర్శి ఖాజా ఖాన్ లతో పాటు ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పొనగంటి సంపత్,వీణవంక జడ్పిటిసి ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి,బిజెపి నాయకులు ఆకుల రాజేందర్,స్థానిక కౌన్సిలర్ సాయిని రమ,కాంగ్రెస్ నాయకులు సాయిని రవి,కౌన్సిలర్లు దయ్యాల శ్రీనివాస్,భోగం సుగుణ, బీజేపీ నాయకులు ఆకుల రాజేందర్,పలువురు అఖిలపక్షాల నాయకులు పాల్గొన్నారు.
