- మృతదేహనికి సంబంధించిన సమాచారం తెలిస్తే సమాచార ఇవ్వండి
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలంలోని శంభునిపల్లె గ్రామ శివారులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.పోలీసుల అంచనా ప్రకారం, మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని,మృతదేహాన్ని గుర్తుతెలియని దుండగులు ఎక్కడో హత్య చేసి,గోనె సంచిలో కట్టి,అనంతరం వాహనంలో తీసుకువచ్చి శంభునిపల్లె శివారులో పడేసినట్లు తెలుస్తోంది.
కేసు నమోదు చేసి ఈ ఘటనపై జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.హత్యకు గురైన వ్యక్తిని గుర్తించేందుకు మరియు ఈ దారుణానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.గుర్తుతెలియని ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే జమ్మికుంట పోలీసులకు సమాచారం అందించగలరని అధికారులు కోరారు.ఏసిపి హుజూరాబాద్: 8712670733, జమ్మికుంట పట్టణ సీఐ: 8712670766,ఎస్ఐ జమ్మికుంట: 8712551164 లకు సంప్రదించండి..
