డబ్బులకు అమ్ముడు పోయే చరిత్ర మాది కాదు

By dhanadhannews.com

  • అవిశ్వాసంలో ఓడిపోతామనే భయంతో టెక్నికల్ సాకుతో గెలిచారు
  • కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది
  • హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి వొడితల ప్రణవ్

జమ్మికుంట,ధనాధన్ న్యూస్ :

బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో కలిసిన కౌన్సిలర్లు 10లక్షలకు అమ్ముడుపోయారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని,
అమ్ముడుపోయే చరిత్ర బిఆర్ఎస్ పార్టీదేనని కాంగ్రెస్ పార్టీది కాదని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వo మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టిలో చేరిన ప్రతీ కౌన్సిలర్ కు అండగా ఉంటూ ఆరు గ్యారంటిలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న నమ్మకంతో జమ్మికుంట మున్సిపాలిటీ నుండి 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టిలో చేరారు.స్థానిక చైర్మెన్ అవినీతి పై కౌన్సిలర్లకు విసుగెత్తి అవిశ్వాసం పెట్టారనీ ఆయన తెలిపారు.అవిశ్వాసంలో ఒడిపోతామనే భయంతో టెక్నికల్ సమస్యను సాకుగా చూపి గెలిచారన్నారు.ప్రజా పాలన,ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు కొరకై స్థానిక ప్రజలకు చేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు.
ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా కట్టుబడి ఉన్నామన్నారు.మొన్ననే నర్సింగ్ ఉద్యోగులకు అవకాశాలు ఇచ్చామని రాబోయే రోజుల్లో పోలీసు వ్యవస్థలో కూడా అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్ధానం ప్రతి హామీని నెరవేరుస్తమన్నారు.పార్టీలో ప్రాధాన్యత అందరికీ ఉంటుందనీ ప్రజా పాలన నచ్చి కౌన్సిలర్ల,సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు.పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు వస్తాయని రానున్న ఎంపీ,సర్పంచ్,ఎంపిటిసి ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు.అందరినీ కలుపుకొని పోయి పార్టీని ముందుకు తీసుకుపోతామని పేర్కొన్నారు.సమ్మక్క- సారలమ్మ జాతర వస్తుందనీ హుజురాబాద్ లో 11 నుండి 14 సమ్మక్క జాతరలు జరుగుతున్నాయన్నారు.దానికి సంభందించి చైర్మన్ లను ఎన్నుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారనీ తెలిపారు.వైద్యం,నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు,దళిత సంఘాలు దళిత బంధు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి దళిత బంధు రావడానికి నా వంతు కృషి చేస్తానన్నారు. ఉపఎన్నిక సమయంలో ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఇచ్చిన కాపీలు ఏమయ్యాయనీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు.మొన్న తెచ్చుకున్న ప్రజా పాలనలో ఆరు గ్యారంటిలను ప్రతి గడపకు తీసుకొచ్చే భాధ్యత నాది అని ఆయన అన్నారు.చెక్ డ్యాం మరమత్తుల విషయంలో వాటిని రిపేర్ చేయడానికి అవసరమయ్యే ఖర్చులను అధికారులు లెక్కలు వేస్తున్నారనీ వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పూర్తీ కావడానికి దోహదం చేస్తున్నామన్నారు. కమలపూర్ లో నీళ్లు రావడానికి మా వంతు కృషి చేసామనీ ప్రజలకు సేవ చేస్తామన్నరు. కల్వల ప్రాజెక్ట్ పై తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ అమలుకాలేదనీ కాగితాల వరకే హామీలు ఇచ్చారన్నారు.రానున్న ఎంపీ ఎలక్షన్ లో హుజూరాబాద్ నుండి భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేస్తామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వము మారుతుందనీ సి.ఎం.మారుతారనే మాటలు అపండి మారుతారనే అపోహ సృష్టిస్తున్నారు.అంతర్గత సమావేశాలు జరుపుతున్నారనీ తెలిపారు.బలుపు చూసుకొని విర్రవీగితే ఊరుకోరనీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారనీ పేర్కొన్నారు.బీజేపి, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూసి ప్రజలు విసిగి పోయారన్నారు.ఈ సమావేశంలో
పిసిసి నెంబర్ పత్తి కృష్ణారెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మెటి సమ్మిరెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు
కసుబోజుల వెంకన్న, సుంకరి రమేష్ ఎర్రం సతీష్ రెడ్డి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడెపు సారంగపాణి మొలుగురి సదయ్య సీనియర్ నాయకులు ముద్దమల్ల రవి ఎండి సలీం అయోధ్య గౌడ్ పాతకాల అనిల్ ప్రవీణ్ అశోక్ పట్టణంలోని వార్డు అధ్యక్షులు లతో పాటు కాంగ్రెస్ పార్టీ చెందిన 13మంది జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.