- సర్పంచ్ని అభినందించిన గ్రామస్తులు

నడికూడ, ధనాధన్ న్యూస్ : హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ కుడ్ల మలహల్ రావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు కోతుల నుండి విముక్తి కల్పించాలని కోతులు పట్టే వారిని పిలిపించి కోతులను పట్టించారు.వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ,వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ వారికి ఏ ఆపద వచ్చిన ఆదుకుంటానని కోతుల వల్ల సమస్యలు ఉన్నాయని ప్రజలు వివరించడంతో తక్షణమే స్పందించి కోతులను పట్టించడం పట్ల శభాష్.. సర్పంచ్ మలహలరావు సాబ్ అంటూ ప్రజలు సర్పంచ్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో నడికూడ పాలకవర్గ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
