సైదాపూర్,ధనాధన్ న్యూస్:
సైదాపూర్ మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలోని సంతోషిమాత మండల సమాఖ్య కార్యాలయం లో మంగళవారం రోజున సెర్ప్ సిబ్బంది వివోఏలకు లక్పతి దీదీ కార్యక్రమంపై డిపిఎం వంగ రవిందర్,ఎపిఎంలు తిరుపతి,కుమారస్వామిలు శిక్షణ ఇచ్చారు.శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామైఖ్య సంఘం పరిదిలో ఎనభై మంది మహిళలను గుర్తించి వారిని ఫెసిలిటేట్ చేస్తూ ట్రబుల్ షూటర్ గా,నైపుణ్యాలు కల్పించి పర్యవేక్షణ చేసే భాధ్యత రిసోర్స్ పర్సన్స్ చూడాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ ఉపాధి అవకాశాలు కల్పించి,ఆదాయ వనరులను పెంపొందించాలని,వారు చేసుకుంటున్న కార్యక్రమాలతో పాటు బహుళ ఉపాధి అవకాశాలు కల్పించాలని,వాల్యూ ఆడ్ చైన్ కార్యక్రమాలు చేపట్టేలా చూడాలని ఎన్ఆర్ఎల్ఎం,సెర్ప్ ద్వార అమలు పథకాలు వివరిస్తూ,డాక్యుమెంట్ రూపంలో రిపోర్ట్స్ తయారు చేస్తూ,గుర్తించిన మహిళలను రెండేళ్లలో లాక్పతి దీదీలు గా తయారు చేయాలని,సేఫ్టీ సెక్యూరిటీ,సాంకేతికత వ్యవసాయ అనుబంధ ఎంటర్ ప్రైజేస్ వైపు ఆలోచన కల్పించాలని శిక్షణ కార్యక్రమంలో అన్నారు.నూతన అదనపు డీఆర్డీఓ సునిత మాట్లాడుతూ అర్హులైన మహిళలను గుర్తించి ఆదాయ వనరులు కల్పించి లక్పతీ దీదీలుగా తయారు చేయాలని అన్నారు.అనంతరం డీఆర్డీఓ శాలువాతో సన్మానం చేశారు. ఈకార్యక్రమంలో ఎంఎస్ ప్రెసిడెంట్ రజిత,సిబిఓ తిరుపతి,సీసీలు దేవేందర్,రమేశ్,పర్శరాములు,
శ్రీనివాస్,రంజిత్,జమున రాజేశ్వరి,సిఓ కిశోర్,ఎంఎస్ఎ గీత వివోఏలు పాల్గొన్నారు.
