- చివరి సాగు పంట కోసం నీళ్ల కోసం కృషి చేస్తాం
- హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితేల ప్రణవ్.
హుజురాబాద్,ధనాధన్ న్యూస్:
కమలాపూర్ మండలాల గ్రామాల రైతులకు సాగునీరు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని,రైతులకు సాగు పంటలకు సరిపడే నీళ్లు అందించేందుకు ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇంచార్జి ఒడితేల ప్రణవ్ ని కోరారు.కమలాపూర్ మండలం లోని శనిగరం,లక్ష్మీపురం,గుంటూరు పల్లి గ్రామాలకు చెందిన రైతులు తమ పంట పొలాలకు ఎస్ ఆర్.ఎస్.పి.కెనాల్ ద్వారా సాగునీళ్లు అందడం లేదని శనివారం రోజున హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ను కలిసి తమ అవేదన
వ్యక్తం చేశారు.డిబీఎం 22ఏ,22బీ కెనాల్ ద్వారా సాగు నీరు విడుదల చేస్తూ వారబందీ పెట్టడం వల్ల చివరి ఆయకట్టు పంటలకు నీరు అందడం లేదని, రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల సాగు నీరు సమస్య పరిష్కారం కొరకు
ఎస్ఆర్ఎస్పి అధికారులతో ఒడితల ప్రణవ్ ఫోన్లో మాట్లాడుతూ రైతుల సాగు నీళ్లు కొరకు ఎస్ఆర్ఎస్పి అధికారుల సహ సహకారాలు రైతులకు అందించాలని కోరారు.సాగునీరు అందించకపోతే పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతారని రైతులకు సాగునీరు అందిచాలని కోరారు.స్పందించిన ఎస్సారెస్పీ అధికారులు రైతులకు సాగునీరు వచ్చే విధంగా పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తామని
ఈ వారంలో రైతులకు సాగునీరు అందించెందుకు కృషి చేస్తామని ఎస్ఆర్ఎస్పి అధికారులు వోడితల ప్రణవ్ ఫోన్ లో హామీ ఇచ్చారు.అధికారులు ఇచ్చిన హామీతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి వొడితల ప్రణవ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
