- పిచ్ఛాసుపాత్రిలో వెంటనే చేర్పించాలి
- పులి ఆంజనేయులు గౌడ్-జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్
కరీంనగర్,ధనాధన్ న్యూస్:
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిన్న చిగురుమామిడి మండలంలో జరిగిన ప్రజాహిత యాత్రలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని,దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి తప్ప వ్యక్తిగత దూషణలతో పాటు మహిళ లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు.తక్షణమే మంత్రి పొన్నం కి క్షమాపణలు చెప్పనియెడల బండి ప్రజాహిత యాత్ర ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
కేవలం దేవుని పేరుతో రాజకీయాలు చేసే నీకు ఓటమి ఖాయం అయిందని పొన్నం ప్రభాకర్ పై వ్యక్తిగత దూషణలు చేస్తూ ప్రజాహితయాత్ర చేస్తున్నావని,రాబోయే రోజుల్లో కరీంనగర్ ప్రజలు నిన్ను మళ్లీ కార్పొరేటర్ గా కూడా ఎన్నుకోరని సాక్షాత్తు బిజెపి నాయకులే చర్చించుకుంటున్నారని తెలిపారు.ఇంకోసారి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేస్తే నీకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి,కరీంనగర్ నగర బీసీ సెల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్
కరీంనగర్ జిల్లా కార్యదర్శి రామిడి రాజిరెడ్డి,సిటీ కాంగ్రెస్ నాయకులు వంగల విద్యాసాగర్,గంగుల దిలీప్,అక్బర్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
