- బండి సంజయ్ కుమార్ కి కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలి
మానకొండూర్ మండలంలోని వరంగల్- కరీంనగర్ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించి మంత్రి ప్రభాకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ మాట్లాడుతూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ప్రజాహిత యాత్రలో కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ కుమార్ మాట్లాడిన మాటలు వక్రీకరించి దాడులకు పాల్పడడం సరైనది కాదని అన్నారు.హిందువుల మనోభాలు భావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేసిన పొన్నం ప్రభాకర్ వ్యతిరేకంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడితే వారి మాటలను వక్రీకరించి మాట్లాడారని,బండి సంజయ్ కుమార్ కి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతలు పొన్నం పెంపుడు కుక్కలు దాడులు చేస్తున్నారని అన్నారు.దాడులకు ప్రతి దాడులు చేస్తామని హెచ్చరించారు.మానకొండూరు కాంగ్రెస్ స్థానిక నేతలు వాపును చూసి బలుపు అని మురుస్తున్నారని,బండి సంజయ్ కుమార్ పై అనుచిత వాక్యాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.వెంటనే బండి సంజయ్ కుమార్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు కత్తి ప్రభాకర్ గౌడ్,కంది రాజీ రెడ్డి, ఉపాధ్యక్షులు వుషకోయిల రమేష్,యాట లక్ష్మారెడ్డి, వెల్మరెడ్డి రాజేందర్ రెడ్డి,కార్యదర్శి చొప్పరి అశోక్, ఈస్ట్ జోన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు మాచర్ల కోటేశ్వర్,జిల్లా నాయకులు మునిగంటి కుమార్,గాదె రంజిత్ రెడ్డి,ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్,ప్రధాన కార్యదర్శిలు ఎదులాపురం అశ్విన్ తేజ,పోచంపల్లి శ్రీనివాస్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు కత్తి రాకేష్ గౌడ్,నాయకులు సింగిరెడ్డి రమణారెడ్డి,ఆరేపల్లి సునంద్,కొమ్మా అనిల్ యాదవ్,శ్రీకాంత్,అజయ్ పాల్గొన్నారు.
