సైదాపూర్ మండలంలోని లస్మమన్నపల్లి గ్రామంలో శనివారం రోజున ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రజాప్రయోజనం కోసము దీర్ఘకాలము గుర్తుండే విధంగా సమాజానికి సేవ చేసి ఉత్తమ వాలెంటర్లుగా గుర్తింపు పొందాలని సైదాపూర్ ఎంపీడీవో భూక్య యాదగిరి వాలంటీర్లను ఉద్దేశించి చెప్పారు.విఎస్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎస్ వేసవి కాల ప్రత్యేక సేవా శిబిరము శనివారము ముగిసింది.ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటర్లు సేవా దృక్పధ ముని కలిగి ఉండి సమాజమే ప్రధానముగా సేవ చేయాలని అన్నారు. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను గుర్తించి వాటితొలగించే బాధ్యత ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ల పైన ఉన్నదని గుర్తు చేశారు. క్రమశిక్షణతో చేసిన పనికి గుర్తింపు ఉంటుందని, క్రమశిక్షణ ఉన్నచోటనే డెవలప్మెంట్ ఉంటుందని అన్నారు,మానవతా దృక్పథంతో సమాజంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించి సామాజిక అభివృద్ధికి దోహదపడాలని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమాజ అభివృద్ధికి వారు ఈ సందర్భంగా పంచ సూత్రాలను విద్యార్థులకు వివరించారు,జమ్మికుంట లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్మోహన్ మాట్లాడుతూ.ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు జీవిత నైపుణ్యాలను నేర్చుకొని ధైర్యంతో సమాజానికి సేవ చేయాలని అన్నారు.
ప్రముఖ కాలమిస్ట్, జర్నలిస్ట్ ఎడమ శ్రీనివాస్ రెడ్డి వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా విద్యార్థులు మారి సమాజాన్ని హేతుబద్ధంగా మార్చాలని వాలంటీర్లకు గుర్తు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డా” వివిఎన్ హనుమకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు తమ పరిధిని విస్తృతం చేసుకొని సమాజాన్ని అధ్యయనం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ గాజుల శ్రీలక్ష్మి, ప్రోగ్రాం ఆఫీసర్ గబ్బేటి తిరుపతి, సింగిల్ విండో డైరెక్టర్ రామ్ రెడ్డి, మాజీ సర్పంచి కాగిత రాములు, గ్రామ పెద్దలు మాతంగి వెంకటయ్య, పోల్సాని రాంరెడ్డి, లతోపాటు కోఆర్డినేటర్ మాడుగుల అశోక్ ,పోతిరెడ్డి హరీష్ ,కోమల అధ్యాపకులు తాళ్లపల్లి అజయ్,రజిత, గాజుల శారద , విజయ్, సతీష్, వాలంటీర్లు పాల్గొన్నారు.
