మహాజన సోషలిస్ట్ పార్టీ నూతన కమిటీల ఎన్నిక

By dhanadhannews.com

  • హుజురాబాద్ నియోజకవర్గ కన్వినర్ గా ఆళ్ల కేశవులు ఎన్నిక

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం మహాజన సోషలిస్టు పార్టీ హుజురాబాద్ శాఖ ఎన్నికలు సోమవారం ఉదయం  ఎం.ఎస్.పి హుజురాబాద్ నియోజకవర్గ కార్యాలయంలో  ఎం.ఎస్.పి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ అధ్యక్షతన జరిగాయి.ఎంఎస్పి పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ గా కనుకుల గిద్ద గ్రామానికి చెందిన ఆళ్ళ కేశవులు,ఎం.ఎస్.పి హుజురాబాద్ మండల కన్వీనర్ గా సిర్సపల్లి గ్రామానికి చెందిన తునికి భాస్కర్, కో కన్వీనర్లు గా బొడ్డు సంపత్, కల్వల వీరస్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎం.ఎస్.పి జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో బీసీ,ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాల హక్కుల కోసం నిరంతరం మంద కృష్ణ మాదిగ పోరాడుతున్నారని ఆయన పోరాట ఫలితంగానే వితంతు, వృద్యాప్య, ఒంటరి మహిళ ల,దివ్యాంగుల పెన్షన్లు మరియు ఆరోగ్య శ్రీ పథకం అమలులో ఉన్నాయని అన్నారు.అందువల్ల ఎం.ఎస్.పి పార్టీ ని బహుజనులంతా ఏకమై బలోపితం చేయాలని పిలుపు నిచ్చారు.ఎస్సీ వర్గీకరణ సమస్య ను కృష్ణ మాదిగ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేస్తారని వివరించారు.ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.పి పార్టీ రాష్ట్ర నాయకులు మారేపల్లి శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు రేణిగుంట సాగర్, ఎం.ఎస్.పి ఉమ్మడి జిల్లా ఇన్ ఛార్జ్ ఇంజం వెంకటస్వామి, బిజేపి ఎస్సీ మోర్చా హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు బొరగాల సారయ్య,ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి తుంగ ఆంజనేయులు మాదిగ,జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి రవీందర్ మాదిగ,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రొంటాల రాజ్ కుమార్,మోరే సారయ్య తదితరులు పాల్గొన్నారు.