హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా గోస్కుల శ్రీనివాస్

By dhanadhannews.com

  • ఉపాధ్యక్షునిగా బండి రమేష్,ప్రధాన కార్యదర్శి గా మట్టెల తిరుపతి ఎన్నిక

హుజురాబాద్ మార్చ్ 28:న్యాయవాదుల సంఘం కు గురువారం జరిగిన ఎన్నికలలో హుజురాబాద్ అధ్యక్షునిగా గోస్కుల శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా బండి రమేష్,ప్రధాన కార్యదర్శి గా మట్టెల తిరుపతి , లైబ్రరీ సెక్రటరీ అప్పని రాజు, కోశాధికారి గా ఎం దివ్య,సీనియర్ ఎక్సిక్యూటివ్ మెంబర్ గా  పులుగు లింగారెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు కె.భగవాన్ రెడ్డి, సికె జేమ్స్,ఎన్. సత్యనారాయణలు తెలిపారు.మొత్తం 115   మంది ఓటర్లకు గానూ 113 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

అధ్యక్ష పదవికి  పోటీ చేసిన గోస్కుల శ్రీనివాస్ కు 71ఓట్లు, యతిపతి అరున్ కుమార్ కు 41ఓట్లు వచ్చాయి, కాగా ఒక ఓటు చెల్లకుండా పోయింది.. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన బండి రమేష్ కు59 ఓట్లు బోనగిరి కుమారస్వామి కి 52 ఓట్లు రాగా 2 ఓట్లు చెల్లలేదు, ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన మట్టెల తిరుపతి కి 64 ఓట్లు,ఎర్రోళ్ల రమేష్ కు 45 ఓట్లు రాగా  4 ఓట్లు చెల్లకుండా పోయాయి.   కోశాధికారి పదవికి పోటీచేసిన ఎం దివ్య కు 66 ఓట్లు రాగా, సిహెచ్ భానుకిరణ్ కు 44 ఓట్లు రాగా 3 ఓట్లు చెల్లకుండా పోయాయి.లైబ్రేరియన్ పదవికి పోటీచేసిన అప్పని రాజు కు 56 ఓట్లు, బత్తుల తిరుపతి కి 54 ఓట్లు రాగా 3 ఓట్లు చెల్లకుండా పోయాయి, సీనియర్ ఎక్సిక్యూటివ్ సభ్యులుగా పోటీచేసిన పులుగు లింగారెడ్డికి 65 ఓట్లు,అందె వెంకటేశ్వర రావు కు 48 ఓట్లు వచ్చాయి. కాగా సహాయ కార్యదర్శి గా పి.జ్యోత్న దేవి, స్పార్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ గా కల్వల సౌమిత్ర, జూనియర్ ఎక్సిక్యూటివ్ మెంబర్ గా కె.సరిత, మహిళా సభ్యురాలు గా ముశం మౌనిక గతం లోనే ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.