హుజురాబాద్, ఏప్రిల్ 08:జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (ఐ.ఎన్.టి.ఎస్.ఓ) పరీక్షలో హుజురాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య కరికులం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కాకతీయ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మాట్ల సందీప్ కుమార్ తెలిపారు. పాఠశాల విద్యార్థులు 315 మంది ఒలంపియాడ్ పరీక్షలు రాయగా 271 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు.జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో పచ్చిమట్ల అనన్య, రెండవ స్థానంలో గూడూరి ఆశిష్ రెడ్డి,మూడవ స్థానంలో పిపాస మండల్,ఐదో స్థానంలో బొక్కల నవనీత్ రెడ్డి లు నలుగురు విద్యార్థులు గోల్డ్ మెడల్స్, బహుమతులు, సర్టిఫికేట్లు సాధించారు. వీరితోపాటు 267 మంది విద్యార్థులు జాతీయస్థాయిలో కన్సోలేషన్ బహుమతులు, గోల్డ్ మెడల్స్, సర్టిఫికేట్లు సాధించారు. ఐ.ఎన్.టి.ఎస్.ఓ వారు పంపించిన బహుమతులను సోమవారం ప్రిన్సిపాల్ మాట్ల సందీప్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు. ఈ ఒలింపియాడ్ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులను ప్రిన్సిపాల్, యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, ఏజీఎం ముద్రకోల రాజు, కోఆర్డినేటర్ ప్రవీణ్, డీన్ మంద శ్రీనివాస్, ప్రైమరీ ఇంచార్జీ తిరుమల, ఒలింపియాడ్స్ ఇంచార్జులు రజనీకాంత్, చామంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
