- 12 రోజుల పాటు ఘనంగా కళ్యాణ మహోత్సవాల నిర్వహణ
- ఆలయ ప్రధాన అర్చకులు తుపురాణి శ్రీనివాసాచార్యులు వెల్లడి
దామెర/ధనాధన్ న్యూస్: దామెర మండలం ఊరుగొండ లక్ష్మీనర్సింహస్వామి అధ్యయన కల్యాణ మహోత్సవాలు ఈ నెల 7 నుంచి జరుగనున్నాయి.స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వాహకులు 12 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.ఈ క్రమంలో జనవరి 7 నుంచి 18 వరకు 12 రోజుల పాటు నిర్వహించనున్న అధ్యయన కల్యాణ మహోత్సవాలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకోనున్నారు.స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు హైదరాబాద్, కరీంనగర్,ఖమ్మం వంటి పొరుగు జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకోనున్నారు.ఉత్సవాలకు లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం ముస్తాబు చేశారు.
శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ విశిష్టత
ఊరిగొండ లోని శ్రీ లక్ష్మీనర్సింహస్వామి
ఈ ఆలయ విశిష్టత గురించి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ తుపురాణి శ్రీనివాసాచార్యులు తెలిపిన వివరాల ప్రకారం….ఈ ఆలయం అతి పురాతనమైనదని సుమారు 800 సంవత్సరాల క్రితం వెలిసిందని, కాకతీయ రాజులు కూడా ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.గుట్టు పైన స్వామి వారి పాదాల ముద్రలు ఉంటాయని మొదటి గుట్టపైన ఉన్న స్వామివారు గుర్రం మీద వచ్చి గుట్టు కింద దేవాలయంలో వెలిసాడని తెలిపారు.ప్రతి సంవత్సరం సంక్రాంతికి యధావిధిగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని స్వామి వారిని ఊరుగొండ ఊరిలో గల ప్రధాన దేవాలయం నుండి కళ్యాణం అనంతరం విడితి
కొరకు ఏనుగు వాహనం పై తీసుకవచ్చి మూడు రోజులు గుట్టు దగ్గర గల దేవాలయంలో జాతర జరుగుతుందన్నారు.అనంతరం గంప్పవారి కోనేరులో స్నానం చేయించి నాగవెల్లి చేస్తారని ఈ దేవాలయం మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటిగా నిలిచిందని తెలియజేశారు.
భక్తుల సౌకర్యార్థం వసతుల ఏర్పాటు
గత కొన్నేళ్లుగా ఊరుగొండ గ్రామానికి చెందిన గొంది నర్సింహారె డ్డి(ఎస్ఆర్ఎ) తమ తల్లిదండ్రులు గొంది నర్సమ్మ-మల్లారెడ్డి (జీఎన్ఎం) కూడా జ్ఞాపకార్థం కళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు చేపట్టారు.ఊరుగొండలోని ప్రధాన దేవస్థానంతో పాటు గ్రామ సమీపంలోని గుట్ట వద్ద ఉన్న దేవాలయానికి సున్నంతో పాటు రంగులు వేయడం వంటి పనులను పూర్తి చేయించారు.అయితే దామెర మండలంతో పాటు ఆత్మకూరు,శాయంపేట,పరకాల,నడికూడ తదితర మండలాలే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి, స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటారు.కాగా భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
