ఆకునూరు గ్రామపంచాయతీలో డి.ఎల్.పి.ఓ విచారణ

By dhanadhannews.com

  • రావుల రాజిరెడ్డి ఫిర్యాదుతో  రికార్డుల తనిఖీ
  • గ్రామ అభివృద్దె లక్ష్యంగా పనిచేశానే తప్ప అవినీతి తనకు తెలియదన్న మాజీ సర్పంచ్ రమణారెడ్డి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో నూతన గ్రామపంచాయతీ నిర్మాణంలో, స్మశాన వాటికల పనుల్లో అప్పటి  పలు అవకతవకలు జరిగాయని అదే గ్రామానికి చెందిన రావుల రాజిరెడ్డి అనే వ్యక్తి డిసెంబర్ 24న కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై హుజురాబాద్ ఇన్చార్జి  డి.ఎల్.పి.ఓ శ్రీనివాస్ ఫిర్యాదు దారుడితోపాటు,మాజీసర్పంచ్ రమణ రెడ్డిని పిలిపించుకొని విచారణ చేపట్టారు.విచారణ చేసిన నివేదికను పై అధికారులకు అందజేస్తానని డి ఎల్ పి ఓ  పేర్కొన్నారు.ఈ విషయంపై మాజీ సర్పంచ్ రమణారెడ్డిని వివరణ కోరగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా  నిరంతరం పనిచేశానే తప్ప ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు.నిబంధనల ప్రకారమే  ఎలాంటి అవినీతికి తావు లేకుండా గ్రామ అభివృద్ధి చేశామన్నారు.తనపై వ్యక్తిగత కక్షలుంటే తనతో రాజకీయంగా పోటీపడాలే తప్ప, గ్రామ అభివృద్ధిని ఏం చేయడం బాధాకరమని రమణారెడ్డి తెలిపారు. ఫిర్యాదుదారుడు రాజిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 40లక్షల రూపాయల ప్రజల సొమ్ముతో దారి లేని నూతన గ్రామపంచాయతీ నిర్మించి నేడు నిరుపయోగంగా నిలిపారని ఆరోపించారు.గ్రామ అభివృద్ధి కోసం విరాళాలు ఇస్తే సొంతానికి వాడుకున్నాడని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు రాజిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలోఎంపీడీవో యాదగిరి,డిప్యూటీ తాసిల్దార్ నాగార్జున, పంచాయతీ కార్యదర్శులు చిట్యాల రమాసంపత్, నరేందర్ రెడ్డి,కొండల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.