ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు విప్ బాధ్యతలు రావడంతో ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా ఫిషర్‌మెన్ చైర్మన్ బండి మల్లేష్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, గడ్డివానిపల్లి సర్పంచ్ గడ్డి శ్రీనివాస్, వంగ రామకృష్ణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో కృషి చేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తించి ఉన్నత పదవులు కల్పిస్తుందని తెలిపారు.
అలాగే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని కష్టకాలంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా బల్మూరి వెంకట్ ప్రతి కార్యకర్తకు అండగా నిలిచి అనేక పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆయనకు ఇంకా ఉన్నత పదవులు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని కోరారు.
అయితే, మండలంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పట్టించుకోవడం లేదని కొంత ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అరెల్లి రమేష్, గుండారపు సాయికుమార్, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి మంకు ఐలయ్య, ధంసాని కిరణ్, పెద్ది అభి, జక్కు కుమార్, పరకాల విజయ్ తదితరులు పాల్గొన్నారు.
