కనగర్తి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా “మన బడి – మన బాధ్యత” కార్యక్రమం

  • ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరూ సహకరించాలి: మట్ట పవన్ రెడ్డి

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్,జూన్ 13: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “మన బడి – మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.బీజేపీ సీనియర్ నాయకుడు మట్ట పవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల తరగతి గదులు, ప్రాంగణాన్ని శుభ్రపరిచి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మట్ట పవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వాటి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అలాగే గత విద్యా సంవత్సరంలో నిర్వహించినట్లుగానే ఈ విద్యా సంవత్సరంలో కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పదో తరగతి విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఒకే రోజు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సేవా భావం, సుపరిపాలన స్ఫూర్తితో సమాజ హిత కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, బండి సాంబరాజు, బచ్చల రాజమహేందర్, కంచం రాజయ్య, మట్ట అరవింద్ రెడ్డి, మాడిజోడి రవి, సామాను రామారావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment