జమ్మికుంట, ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ బాబు జన్మదినం సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి ప్రాంతంలో వాల్ పోస్టర్‌ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆవిష్కరించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి నివాసం వద్ద బొంగోని వీరన్న, మర్రి రామ్‌రెడ్డి, పంజాల అజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేశిని కోటి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రణవ్ బాబు ముందుకు సాగుతున్నారని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందుతూ, ఈ ప్రాంతానికి ఆశాకిరణంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రణవ్ బాబు రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్‌తో ముందుకు సాగుతున్న నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు.

పదవి లేకున్నా ప్రజల కోసం సేవ చేయడం ప్రణవ్ బాబుకే సాధ్యమని దేశిని కోటి అన్నారు. తాత వొడితల రాజేశ్వరరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని, తాతకు తగ్గ మనవడిగా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. భవిష్యత్తులో మరింతగా ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రణవ్ బాబుకు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

ప్రణవ్ బాబు జన్మదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు యూత్ కాంగ్రెస్ నాయకులు బొడిగె శ్రీకాంత్, ఎండీ సజ్జు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్రం సతీష్‌రెడ్డి, పెద్ది కుమార్, జిల్లెల్ల తిరుపతిరెడ్డి, రామారావు, జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు చందా రాజు, కుదాటి తిరుపతి, మాచర్ల రాజు, ఒగ్గు రమేష్, ఎగిత సుజాత, అశోక్, పాతకాల మౌనిక, అనిల్, యాట్ల సునీత, అశోక్‌తో పాటు మహిళా కాంగ్రెస్ నాయకులు తోట స్వప్న, పిడుగు భాగ్యలక్ష్మి, మాజీ కౌన్సిలర్ శ్రీహరి, వార్డు అధ్యక్షులు టెంకురాల కిషోర్, ఆడెపు దేవరాజ్, రాజేష్, రాజకుమార్, ఏఎంసీ డైరెక్టర్ సూర్య, రాజేశ్వరరావు, తిరుపతిరెడ్డి, దేవస్థాన డైరెక్టర్ చిరంజీవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply