జగిత్యాల, ధనాధన్ న్యూస్: మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించడంతో పాటు, ఇతర మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.జగిత్యాల పట్టణంలో ఏవీకే మెహందీ ఆర్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెహందీ ఆర్ట్ కేంద్రాన్ని ఆడువాల జ్యోతి లక్ష్మణ్ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు సౌమ్యను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.హైదరాబాద్ నగరంలో లభించే మెహందీ ఆర్ట్ సేవలను జగిత్యాలలోనే అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని అన్నారు. మహిళల అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల డిజైన్లను అందిస్తూ ప్రత్యేకమైన మెహందీ ఆర్ట్‌తో కస్టమర్లను ఆకట్టుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.


మహిళలు తమలోని నైపుణ్యాలను గుర్తించి స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని జ్యోతి లక్ష్మణ్ సూచించారు. ఒక మహిళ తనకు తాను ఉపాధి పొందడంతో పాటు మరికొంతమంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు అండగా నిలవడం గొప్ప విషయమన్నారు.
ఇలాంటి మహిళలను సమాజం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, మహిళా సాధికారతకు స్వయం ఉపాధి ఎంతో కీలకమని తెలిపారు. జగిత్యాలలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ముందుకు సాగుతున్న సౌమ్యను ప్రత్యేకంగా అభినందించారు.
మహిళలు తమ ప్రతిభపై నమ్మకంతో ముందుకు సాగితే మరిన్ని విజయాలను సాధించవచ్చని జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మనపురి పవిత్ర మహేష్, కోఆప్షన్ సభ్యురాలు వీరబత్తిని పద్మజ శ్రీనివాస్‌తో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply