అక్బరుద్దీన్ ఓవైసీ కీ ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్

By dhanadhannews.com

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: హైద‌రాబాద్ పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణాన్ని చేపడుతామని,ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాంద్రాయణ గుట్టకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం ఓట్లు అడుగుతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లా డుతూ.. అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి గెలిపిస్తానని వ్యాఖ్యానిం చారు.కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు కొడంగల్ బీఫామ్ ఇచ్చి దగ్గరుండి నామినే షన్ వేయిస్తానని..గెలిపించి ఉపముఖ్యమంత్రిని చేస్తానన్నారు.కాగా,అంతకు ముందు ఎంఐఎం అక్బ‌రుద్దీన్ అసెంబ్లీలో మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతానికి మెట్రో రైలును విస్తరించాలని డిమాండ్ చేశారు.తమతో తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్న కేటీఆర్ తెస్తున్నాం.. తెస్తున్నాం అంటూ కాలయాపన చేశారు తప్పా ఏనాడూ ముందడుగు వేయలేదని అసహనం వ్యక్తం చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెట్రో హైదరాబాద్‌కు మెట్రో కావాలని తానే డిమాండ్ చేసినట్లు గుర్తుచేశారు. దీని కోసం ఆనాడు ముఖ్య మంత్రితో కలిసి ఢిల్లీకి వెళ్లినట్లు తెలిపారు.చివరకు పోరాడి తీసుకొచ్చామని కానీ,నా ప్రాంతం లోనే ఇప్పుడు మెట్రో సేవలు లేవు అని ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు అని అన్నారు.దీనిపై రేవంత్ మాట్లాడుతూ,పాతబస్తీ మెట్రో నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.దీనిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.మెట్రో నిర్మాణం కోసం ఎల్ అండ్ టీతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.హైటెక్ సిటీ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు గత ప్రభుత్వం టెండర్లు పిలిచిందని మండిపడ్డారు.రియల్ ఎస్టేట్ సంస్థల భూముల ధరలను పెంచేందుకే ఆ మార్గంలో మెట్రో రైలు ప్రతిపాదించారన్నారు.ఇప్పటికే ఫైనాన్షియల్ డిస్ట్రి క్ట్ నుంచి ఎయిర్‌ పోర్ట్‌కు మంచి రోడ్లు ఉన్నాయన్నా రు. గత ప్రభుత్వం మెట్రో అవసరం లేని మార్గాల్లో మెట్రో నిర్మాణానికి టెండర్లు పిలిచారని ఆరోపించారు.తమ ప్రభుత్వం ఎల్బీ నగర్ నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో నిర్మిస్తుందన్నారు. పాతబస్తీకి మేలు కలిగేలా చాంద్రాయణగుట్ట మీదుగా మెట్రో నిర్మాణం చేపడతా మన్నారు…