గుడ్ న్యూస్ పాస్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీ నియామకం

By dhanadhannews.com

జమ్మికుంట,ధనాధన్ న్యూస్:

గుడ్ న్యూస్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.జమ్మికుంట మండలం అధ్యక్షునిగా వడ్లూరి ఏ పప్రా,కార్యదర్శిగా కలకోట స్టీఫెన్ రాజ్,ట్రెజరర్ కలకోట సత్యరాజు లను ఎన్నుకున్నారు.అదేవిధంగా ముఖ్య సలహాదారునిగా తాల్లపల్లి జాషువా,వైస్ ప్రెసిడెంట్ కె ప్రభాకర్,జాయింట్ సెక్రెటరీ ఎం మోజెస్,కమిటీ సభ్యులు సిహెచ్ రాజు,రవీందర్ పాలు,యెహోషువ ను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా నూతన కమిటీ మాట్లాడుతూ క్రైస్తవ సోదరులకు ఇలాంటి ఆపద వచ్చినా అండగా నూతన కమిటీ ఉంటదని తెలిపారు.ఇటీవల క్రైస్తవులు అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దేశ ప్రజలను సమానంగా నాయకులు చూడాలని,భద్రత కల్పించాలని కోరారు.