జగిత్యాల రూరల్/ధనాధన్ న్యూస్,ఆగస్టు 1: జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శనివారం మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికల్లో సంఘం అధ్యక్షుడిగా బక్కచెటి చిన్న గంగాధర్, ఉపాధ్యక్షుడిగా సకినాల శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి గ్రామంలోని మున్నూరు కాపు సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ధనాధన్ న్యూస్ రిపోర్టర్ రాజు రెడ్డి వారికి అభినందనలు తెలుపుతూ, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply