- కొరివి అరుణ్ కుమార్-జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు
కరీంనగర్,ధనాధన్ న్యూస్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ హెచ్చరించారు.సోమవారం బాల్క సుమన్ రేవంత్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం స్థానిక ఇందిరా చౌక్ లో నగర ఎస్సి సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కల్వకుంట్ల పెంపుడు కుక్క అయిన బాల్క సుమన్ మతిభ్రమించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని సుమన్ పద్ధతి మార్చుకోకపోతే ప్రతి చర్యలు తప్పవని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఉస్మానియా విద్యార్థిగా చెప్పుకునే బాల్క సుమన్ చెప్పులు చూపించే సంస్కృతి ఎక్కడ నేర్చుకున్నావని ఆయన ప్రశ్నించారు.9 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో దళితులను మోసం చేసినప్పుడు నీ చెప్పులు ఎక్కడ పెట్టుకున్నావ్ అని,అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే హామీలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ ప్రజల మన్నలను పొందుతున్న రేవంత్ రెడ్డి ని చూస్తే అసూయగా ఉందా అని ఆయన ఎద్దేవా చేశారు.వెంటనే బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే ఎక్కడికక్కడ అడ్డుకొని అవసరమైతే భౌతిక దాడులకు కూడా సిద్ధపడతామని తెలంగాణలో తిరగనివ్వకుండా చేస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. బారాస ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరుగుతుంటే నోరు మెదపని బాల్క సుమన్ ఏనాడో దళిత ద్రోహిగా మిగిలిపోయాడని,తెలంగాణ ప్రజలు గాని దళితులు గాని బిఆర్ఎస్ నాయకులను నమ్మే పరిస్థితి లేదని,వారికి కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
తదనంతరం బాల్క సుమన్ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు వెన్న రాజ మల్లయ్య,లింగంపల్లి బాబు,ఏం డి తాజ్, శ్రావణ్ నాయక్,అబ్దుల్ రహమాన్, శ్రీనివాస్ రెడ్డి కలువల రాంచందర్,సయ్యద్ అఖిల్,కుర్ర పోచయ్య, బాల బద్రి శంకర్ హస్త పురం రమేష్ జీడీ రమేష్, నాగప్రసాద్,దండి రవీందర్,పోరండ్ల రమేష్, సలీముద్దీన్,దన్న సింగ్,దీకొండ శేఖర్,కుంభాల రాజ్ కుమార్,అజీమ్,బారి,అస్థపురం తిరుమల,ముల్కల కవిత యోనా,జ్యోతి,నెల్లి నరేష్,నిహాల్ అహ్మద్,అక్బర్,కీర్తి కుమార్,మాలోతు మహాలక్ష్మి, సిరికొండ శివప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.
