
జగిత్యాల,ధనాధన్ న్యూస్: జగిత్యాల జిల్లా బీర్పూర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) రాహుల్ ఏసీబీ అధికారుల వలలో చిక్కినట్లు సమాచారం. ఓ పని నిమిత్తం లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా దాడి నిర్వహించి ఆర్ఐ రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన వద్ద నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం బీర్పూర్ రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అధికారుల ప్రకటన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
