దళిత బంధు రెండవ విడత కోసం లబ్ధిదారుల ఎదురుచూపు.

By dhanadhannews.com

సీఎం గారు మాకు న్యాయం చేయండి.

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు ఆబాది జమ్మికుంటలో దళిత బంధు లబ్ధిదారులు రెండో విడత నిధులను ఎలాగైనా మంజూరు చేసి మా దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు.గతంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

బీఆర్ఎస్ నాయకులు వెంకటేష్.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు భోగం వెంకటేష్ మాట్లాడుతూ దళితబందు మొదటి విడత వచ్చి రెండవ విడత కోసం 18నెలలుగా ఎదురుచూస్తున్నారని మా ఒక్క వార్డులోనే 100 పైగా కుటుంబాలు ఉన్నారని తెలిపారు.అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆలస్యం చేసారని ఎలక్షన్స్ కోడ్ పడే వరకు కూడా కాళ్ళు అరిగేలా లబ్ధిదారులు ఆఫిస్ ల చుట్టూ తిరిగిన పట్టించుకోలేదని ఎలక్షన్స్ కోడ్ ఎత్తివేసిన తరువాత ఇస్తారేమో అని కోటి ఆశలు పెట్టుకున్నారు.కానీ అనుకోకుండా ప్రభుత్వం మారడంతో దళితులు అయోమయంలో పడ్డారని షాప్ లు పెట్టుకున్న వారు రూమ్ కీరాయిలు కట్టలేక అప్పు చేసి కాలం వెళ్ళదిస్తున్నారని అని తెలిపారు.వెంటనే దళిత బందు అమలుపైన స్పష్టత ఇచ్చి దళితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.