కాంగ్రెస్ లోకి జమ్మికుంట బీఆర్ఎస్ కౌన్సిలర్లు.

By dhanadhannews.com

  • మరికొన్ని క్షణాల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
  • సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరెందుకు హైదరాబాద్ కి.
  • నెక్స్ట్ కౌన్సిలర్ టికెట్ హామీ తో కాంగ్రెస్ లోకి.
  • 14 మంది కౌన్సిలర్లతో హైదరాబాద్ కి వెళ్లినట్లు సమాచారం.
బిగ్ బ్రేకింగ్ న్యూస్.

జమ్మికుంట మున్సిపాలిటీ లో మళ్ళీ కలవరం మొదలైంది.మొన్నటి వరకు చైర్మన్ పై అవిశ్వాసం తో పరిపాలన అస్తవ్యస్తంగా జరిగింది. మొన్నటి వరకు ఒక వర్గం లో ఉన్న 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు నేడు కాంగ్రెస్ లో చేరడానికి హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున బీ ఫామ్ హామీతో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నట్లు సమాచారం.మొన్నటి వరకు పెట్టిన అవిశ్వాసం లో కీలక పాత్ర వహించిన కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరెందుకు ప్రయత్నాలు సాగినట్లు వినికిడి.మరికొన్ని క్షణాల్లో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితేల ప్రణవ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జమ్మికుంట బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొనున్నట్లు సమాచారం.ఎవరెవరు చేరాబోతున్నారో మరికొన్ని క్షణాల్లో తెరపైకి.ఇదే జరిగితే జమ్మికుంట మున్సిపల్ లో మళ్ళీ అలజడులు మొదలైనట్లే.ఎం జరుగుతోందో మరికొన్ని క్షణాలు వెయిట్ చేయవలసిందే..