హుజురాబాద్‌లో ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ నాయకులకు అవగాహన కార్యక్రమం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్,మే 29:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్‌ఐఆర్ (SIR) అంశంపై గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పించాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎస్‌ఐఆర్ సమన్వయకర్త, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమం హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో […]
గుర్తు తెలియని మహిళ మృతి..వివరాలు తెలియజేయాలంటూ రైల్వే పోలీసుల విజ్ఞప్తి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 29:జమ్మికుంట – బిసుగిరిషరీఫ్ రైల్వే స్టేషన్ల మధ్య జమ్మికుంట రైల్వే ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మహిళ ఎగువ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని, లేక ఇతర కారణాలతో మృతి చెందిన అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం […]
ధనాధన్ న్యూస్ లో ప్రచురితమైన కథనానికి స్పందన

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న గోనెసంచుల సమస్యపై ధనాధన్ న్యూస్ తెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. రైతులకు గోనెసంచులు అందించేందుకు నిరాకరించిన యజమాని, వార్త ప్రచురితమైన అనంతరం మంగళవారం ఉదయం వెంటనే సంచులు అందజేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు “మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి” అంటూ రైతుల సమస్యను పట్టించుకోని యజమాని వైఖరిపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ధనాధన్ న్యూస్‌లో కథనం వెలువడిన తర్వాత […]
మక్క కొనుగోళ్లలో జాప్యం.. రైతుల ఆగ్రహం

సైదాపూర్/ధనధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ పది రోజుల్లో మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, స్థానిక టెండర్ యజమాని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సంచుల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోజులు గడుస్తున్నా పంట కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదని వాపోతున్నారు. […]
ఇసుక కొరతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు బ్రేక్

సైదాపూర్/ధనాధన్ న్యూస్,మే 25:ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ… మరోవైపు ఇసుక ఆన్‌లైన్ సమస్యలు లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఇసుక అందుబాటులో లేక ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఇసుక ఆన్‌లైన్‌లు అందుబాటులో లేకపోవడం, అనంతరం ఒక్కసారిగా భారీ సంఖ్యలో అనుమతులు జారీ కావడంతో ట్రాక్టర్లు, కార్మికులు […]
దారి దోపిడీ కేసు ఛేదన

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 21:కోరపల్లి గ్రామ రహదారిపై ఇటీవల చోటుచేసుకున్న దోపిడీ ఘటనను జమ్మికుంట పోలీసులు వేగంగా ఛేదించి, ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి తెలిపారు. గురువారం జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం, మే 20వ తేదీ రాత్రి కోరపల్లి గ్రామం వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం (టీఎస్ 08 యూడీ 5457)ను 11 మంది […]
రాత్రివేళ ఆటో ట్రాలీని అడ్డగించి నిలువు దోపిడీ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై దాడి చేసి నగదు, బంగారు ఉంగరం దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం తూర్పాయగూడెంకు చెందిన నల్లమల్ల ఆంజనేయులు (45) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నెల 20న ఆవుల రాములు అనే వ్యక్తి ఆటో ట్రాలీని కిరాయికి తీసుకొని పెద్దపల్లి జిల్లా పొత్కపల్లికి వెళ్లి మూడు ఎడ్లను కొనుగోలు చేశారు. అనంతరం వాటిని ఆటో […]
ప్రణాళికాబద్ధంగా చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధ్యం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గురువారం ఘనంగా సన్మానించారు. తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మండ్ల భాస్కర్ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారికి, వారి తల్లిదండ్రులకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. ఆకునూరు పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ […]
రెండో విడుత గొర్రెల పంపిణీ పథకం పునరుద్ధరించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: రాష్ట్రంలోని గొల్ల, కురుమల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచిన గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలని మండల కురుమ సంఘం యూత్ అధ్యక్షుడు మునిపాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీపై గొర్రెల యూనిట్లు పంపిణీ చేయడంతో వేలాది కుటుంబాలు స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేసినట్లు తెలిపారు. మొదటి విడతలో లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు అందించినప్పటికీ, రెండో విడత అమలు […]
బండి భగీరథ్ అరెస్టుకు టీజేఎస్ మహిళా విభాగం డిమాండ్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్ మే 16:మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) మహిళా విభాగం రాష్ట్ర మహిళా కమిషన్‌ను కోరింది. ఈ మేరకు టీజేఎస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అరికిల్ల స్రవంతి, ముత్తు గీతాంజలి, మహిళా నాయకురాలు లావణ్య శనివారం మహిళా కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో వారు పేర్కొన్నదేమిటంటే… బాధిత మైనర్ […]
