ప్రణవ్ బాబు జన్మదినం సందర్భంగా వాల్ పోస్టర్ ఆవిష్కరణ

జమ్మికుంట, ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ బాబు జన్మదినం సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి ప్రాంతంలో వాల్ పోస్టర్‌ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆవిష్కరించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి నివాసం వద్ద బొంగోని వీరన్న, మర్రి రామ్‌రెడ్డి, పంజాల అజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేశిని కోటి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రణవ్ […]
బాలపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

జగిత్యాల, ధనాధన్ న్యూస్: జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం గ్రామానికి చెందిన నాయకులు గుంటి చిన్నన్న మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

జగిత్యాల, ధనాధన్ న్యూస్: జిల్లాలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం జగిత్యాల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వేదిక నిర్మాణం, పతాకావిష్కరణ స్థలం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రాంగణం, స్టాళ్ల ఏర్పాటు, పార్కింగ్, భద్రతా చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు […]
రాజకీయాలు చేయొద్దు..ప్రజలకు నిజాలు చెప్పండి! మంత్రులకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

కమలాపూర్,ఆగస్టు 10: కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తున్న సమయంలో ఎమ్మెల్యే స్పందిస్తూ, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “అబద్ధాలు చెప్పొద్దు.. నిజాలు మాట్లాడాలి. ఇది రాజకీయాలు చేయాల్సిన వేదిక కాదు. ప్రజలకు […]
కోరుట్లలో తెలంగాణ శ్రీనివాసులు సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

జగిత్యాల/ధనాధన్ న్యూస్: కరీంనగర్ తెలంగాణ శ్రీనివాసులు సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ఊట్కూరి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలో తెలంగాణ శ్రీనివాసులు సేవా సంస్థ, కోరుట్ల శ్రీనివాస్ మిత్రుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 20 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.ఈ రక్తదాన శిబిరాన్ని కోరుట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, […]
ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా: వొడితల ప్రణవ్

జమ్మికుంట,ఆగస్టు 5 (ధనాధన్ న్యూస్): అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు.బుధవారం జమ్మికుంట పట్టణంలోని 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 14, 15, 24, 28 వార్డుల్లో నిర్వహించిన “ప్రతి గడపకు సంక్షేమం – ప్రజల వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 22 […]
మాతృత్వానికి మానవత్వం జోడించిన ఓం శ్రీ సాయి హాస్పిటల్

జగిత్యాల, ఆగస్టు 3 (ధనాధన్ న్యూస్): వైద్యం అంటే కేవలం చికిత్స మాత్రమే కాదు.. సేవ, మానవత్వం, ఆప్యాయత కూడా కలిసినప్పుడే అది సంపూర్ణమవుతుంది. ఈ మాటలను నిజం చేస్తూ జగిత్యాల పట్టణంలోని ఓం శ్రీ సాయి హాస్పిటల్ ప్రసూతి సేవల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చే ప్రతి తల్లికి, నవజాత శిశువుకు అవసరమైన వస్తువులతో కూడిన ఉచిత బేబీ కిట్‌ను అందజేస్తూ మాతృత్వానికి మధుర జ్ఞాపకాన్ని అందిస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన కేసీఆర్ […]
జమ్మికుంట అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

జమ్మికుంట, ఆగస్టు 1(ధనాధన్ న్యూస్): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని శనివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.యూనియన్ అధ్యక్షుడిగా అంబాల రజనీకాంత్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసిన సభ్యులు మరోసారి ఏకగ్రీవంగా బాధ్యతలు అప్పగించారు.నూతన కమిటీలో ఉపాధ్యక్షుడిగా దొడ్డి రాజు, కోశాధికారిగా రాజేష్, ప్రచార కార్యదర్శిగా నన్నబోయిన రాజును ఎన్నుకున్నారు. యూనియన్ బలోపేతం కోసం కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎంపిక […]
నర్సింగాపూర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా బక్కచెటి చిన్న గంగాధర్ ఎన్నిక

జగిత్యాల రూరల్/ధనాధన్ న్యూస్,ఆగస్టు 1: జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శనివారం మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికల్లో సంఘం అధ్యక్షుడిగా బక్కచెటి చిన్న గంగాధర్, ఉపాధ్యక్షుడిగా సకినాల శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి గ్రామంలోని మున్నూరు కాపు సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ధనాధన్ న్యూస్ రిపోర్టర్ రాజు రెడ్డి వారికి అభినందనలు తెలుపుతూ, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు, […]
కరీంనగర్‌లో నూతన సిటీ బస్ సర్వీసుల ప్రారంభం

కరీంనగర్/ధనాధన్ న్యూస్: నగర ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో కరీంనగర్ నుంచి చింతకుంట, కొత్తపెళ్లి హవేలీ, వాగేశ్వరి కాలనీలకు నూతన సిటీ బస్ సర్వీసులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నగర ప్రజలకు మెరుగైన ప్రజా […]
